Header Banner

జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్! ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా..

  Thu Feb 20, 2025 20:10        Politics

వైసీపీ అధినేత జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లడంపై సీఎం మండిపడ్డారు. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే కుదరదని చెప్పారు. అక్రమాలు చేస్తా... పోలీసుల రక్షణ ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని అన్నారు. రౌడీయిజం చేయడం సరికాదని అన్నారు. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా మిర్చి రేట్లు పడిపోయాయని చంద్రబాబు చెప్పారు. విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రేట్లు తగ్గాయని అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: చంద్రబాబు, పవన్ లతో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ! ప్రజలకు ఇచ్చిన హామీలకు..

 

సాగు ఖర్చులను రియలిస్టిక్ గా వేసి ధరలు నిర్ణయించాలని అన్నారు. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించామని తెలిపారు. ధరల స్థిరీకరణకు ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. కేంద్ర వాణిజ్యశాఖతో మరిన్ని సంప్రదింపులు జరుగుతాయని తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించామని చంద్రబాబు వెల్లడించారు. 2027లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ చేతకానితనం వల్ల కేంద్ర నిధులను వాడుకోలేకపోయామని విమర్శించారు. అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #APpolitics #APNews #polices